telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

20 లక్షల పిల్లులను చంపడానికి ఆ ప్రభుత్వం ప్లాన్…!?

Cats

ఆస్ట్రేలియా ప్రభుత్వం 2020లోపే 20 లక్షల పిల్లులను చంపే యోచనలో ఉంది. ఈ పిల్లులు ఆహారం కోసం వేటాడటంతో ఆస్ట్రేలియాలోని అనేక జాతులకు చెందిన పక్షులు, ఇతర జంతువులు కనుమరుగవుతున్నాయని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ కారణంగానే తాము పిల్లులను చంపే నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆస్ట్రేలియాలో దాదాపు అరవై లక్షల పిల్లులు ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం వాటిలో మూడొంతుల పిల్లులను చంపాలని నిశ్చయించుకుంది. 2015లోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా… పలు విమర్శలు రావడంతో వెనక్కు తగ్గింది. ఈసారి ఎలానైనా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది.

పిల్లులకు మాంసంలో విషం పెట్టి చంపాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ మాంసాలతో కూడిన ఆహారంలో విషం కలిపి ఈ ఆహారాన్ని విమానాల ద్వారా పిల్లులున్న ప్రాంతాల్లో వేయనున్నారు. ఇలా చేయడం ద్వారా ఆహారాన్ని తిన్న 15 నిమిషాలకే పిల్లులు మరణిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దీని కోసం ప్రభుత్వం 50 లక్షల డాలర్లను విడుదల చేసింది. పిల్లులను చంపాలంటే తమకు కూడా బాధగానే ఉందని కానీ ప్రతి ఏడాది ఈ పిల్లులు పది లక్షల పక్షలను, మరో పదిహేను లక్షల రెప్టైల్స్‌ను చంపుతున్నాయని పర్యావరణశాఖ మంత్రి తెలిపారు. పిల్లులను చంపినంత మాత్రాన మిగతా జీవులకు హాని తప్పినట్టేనా అని మరోపక్క అనేకమంది వాదిస్తున్నారు. కాగా, 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్ నుంచి బోటు మార్గంలో కొంత మంది ఈ పిల్లులను ఆస్ట్రేలియాకు తరలించినట్టు సమాచారం. అప్పటి నుంచి అవి వేల నుంచి లక్షలుగా మారి ఆహారం కోసం తోటి మూగజీవులను చంపుతూ వస్తున్నాయి.

Related posts