telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ అతను చేసిన పనికి యువతులు ఫిదా.. ఇంతకీ అతనేం చేశాడంటే…!!?

Mark

ఇంగ్లాండ్‌కు చెందిన మార్క్ రొఫే (30) స్నేహితుల్లో కొందరు వివాహం చేసుకున్నారు. మరికొందరు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు కూడా ఓ తోడు కావాలని మర్క్ రొఫే కోరుకున్నాడు. ప్రయత్నాలు కూడా ప్రారంభించాడు. అయితే అతని ప్రయత్నాలు ఫలించలేదు. అయినా నిరాశపడలేదు. వాలెంటైన్స్ డే నాటికి తనకు కూడా ఓ గర్ల్‌ఫ్రెండ్ కావాలని గట్టిగా అనుకున్నాడు. ప్రముఖ డేటింగ్ యాప్‌లలో గర్ల్‌ఫ్రెండ్ కోసం వెతుకులాట కొనసాగిస్తూనే.. మరో పక్క ‘డేటింగ్ కోసం నాకొక సింగిల్ కావాలంటూ’ మాంచెస్టర్ సెంటర్‌లో ఓ పెద్ద హోర్డింగ్‌పై ప్రకటన ఇచ్చేశాడు. అంతేకాకుండా డేటింగ్‌మార్క్ పేరిట ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించాడు. దీంతో ఫిదా అయిన యువతులు అతనితో డేటింగ్ కోసం క్యూ కడుతున్నారు. డేటింగ్ చేయడానికి ఇప్పటికే తనను 20 మందికిపైగా యువతులు సంప్రదించారని మార్క్ రొఫే పేర్కొన్నాడు.

Related posts