telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

దొంగలకు షాక్ ఇచ్చిన పాములు, బల్లులు…!!

Thief

దొంగిలించిన బ్యాగ్‌లో విలువైన వస్తువులు లేదా డబ్బులు ఉంటాయని ఆశించిన ఆ దొంగల ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బ్యాగ్‌లో తెరిచి చూడగానే వారి గుండె గుభేల్ అంది. అందులో ఉన్న పాములు, బల్లులను చూసి వారికి ప్రాణం పోయినంత పనైంది. దీంతో వాళ్లు ఆ బ్యాగ్‌ను అక్కడే వదిలేసి పరుగులు పెట్టారు. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. శాన్‌జోస్ ప్రాంతానికి చెందిన బ్రయిన్ గాండే అనే వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్ లైబ్రరీలో జరిగిన సరీసృపాల ప్రదర్శనలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నాలుగు అరుదైన కొండచిలువలు, ఒక బల్లిని బ్యాగులో పెట్టి తీసుకొచ్చాడు. ప్రదర్శన తర్వాత ఆ బ్యాగ్‌ను కారు వెనుక సీటులో పెట్టి లోపలికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఆ బ్యాగ్ మాయమైంది. దీంతో బ్రయిన్ కంగారుపడ్డాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బ్రయిన్ యూట్యూబ్‌ వీడియో ద్వారా తన బాధను వెల్లడించాడు. డబ్బులు పోయినా తాను అంత బాధపడేవాడిని కాదని తెలిపాడు. ఆ బ్యాగ్ దొంగిలించిన వ్యక్తులకు పాములు, బల్లులను పెంచడం చేతగాదని, వాటిని ఏమైనా హాని తలపెడతారేమో అని భయంగా ఉందని తెలిపాడు. ఎవరికైనా ఆ పాములు కనిపిస్తే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలన్నాడు.

Related posts