telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు : .. దొంగల దెబ్బకు .. షాక్ లో ఇంటి సభ్యులు ..

thieves in bigg boss 3 telugu house

ఇంటి సభ్యులు ఎవరి పనిలో వారుండగా, సడెన్‌గా దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. నల్లరంగు దుస్తులు ధరించి, మొఖానికి మాస్క్‌తో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలని చూసి ఇంటి సభ్యులు ఉలిక్కి పడ్డారు. మూకుమ్మడి దాడి చేసిన దొంగలు దొరికినంత దొచుకొని వెళ్ళారు. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికి , వంటసామాగ్రి, మేకప్ కిట్స్ తదితర వస్తువులని దొంగలు దొంగిలించారు. ఇక వీక్లీ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఓ టాస్క్ ఇచ్చారు. ‘దొంగలు దోచిన నగరం’ పేరుతో జరగనున్న టాస్క్‌లో ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోవాల్సి ఉంటుంది. ఒకటి దొంగల ముఠా కాగా, మరొకరటి నగర వాసులు. దొంగలకు రాణిగా శిల్పా ఉండగా, దొంగలుగా రాహుల్‌, రవికృష్ణ, శివజ్యోతి, వరుణ్, పునర్నవి సందేశ్ ఉన్నారు.

నగర వాసులుగా శ్రీముఖి, హిమజ, అలీ, వితికా, మహేష్‌, బాబా భాస్కర్ ఉంటారని బిగ్ బాస్ తెలిపారు. రాణిని గద్దె దింపడానికి నగరవాసులు చేయవలసిన పనులు గార్డెన్ ఏరియాలో రాణి పోస్టర్‌లన్నింటికి నలుపు రంగు వేయాలి. రాణికి సంబంధించిన జెండాలన్ని తీసేయాలి.రాణి గన్ తీసుకునే ప్రయత్నం చేయాలి. స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న రాణి నిధి దొంగిలించాలి అని బిగ్ బాస్ తెలిపారు. ఇలా చేస్తే నగర వాసులకి తమకి కావలసిన వస్తువులు లభిస్తాయని స్పష్టం చేశారు. బలపరీక్షకి సంబంధించిన టాస్క్ కావడంతో ఇంటి సభ్యులు తమ బలంతో పాటు మెదడుకి కాస్త పని చెప్పారు. ఒకానొక సందర్భంలో టాస్క్ హింసాత్మకంగా మారుతుందని భావించిన బిగ్ బాస్ అందరిని లివింగ్ ఏరియాలోకి పిలిచి టాస్క్‌ని శాంతియుతంగా ఆడాలని సూచించారు. దొంగలు దోచిన నగరం టాస్క్‌లో దొంగల దగ్గర ఉన్న జెండాలని తీసుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు చాలా ఎఫర్ట్ పెట్టారు.

శిల్పాని హిమజ కాళ్ళతో బంధించి మరీ పట్టుకోగా, శ్రీముఖి కూడా పునర్నవిని ఎక్కడకి కదలకుండా గట్టిగా లాక్ చేసింది. శివజ్యోతి కూడా గట్టి పోటీ నిచ్చింది. నిధి దొంగిలించే సమయంలో రవికృష్ణ, రాహుల్‌, వితికా, అలీ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఒకానొక సమయంలో వితికా, రవి మధ్య చిన్నపాటి ఆర్గ్యుమెంట్స్‌ కూడా జరిగాయి. హౌజ్‌లో భార్య, భర్తలు అయిన వరుణ్, వితికాలు ఇప్పటి వరకు చాలా అన్యోన్యంగా కనిపించగా, నిన్నటి టాస్క్‌లో మాత్రం ఒకరినొకరు దూషించుకున్నారు. ముఖ్యంగా వితికాపై ఫుల్ సీరియస్ అయ్యాడు వరుణ్‌. రాహుల్‌కి దెబ్బ తగిలిందని గేమ్‌కి కాసేపు బ్రేక్ ఇవ్వగా, ఆ సమయంలో వితికా గన్ దొంగిలించే ప్రయత్నం చేయగా, వరుణ్‌..ఆమెపై నిప్పులు చెరిగాడు. కనీసం కామన్ సెన్స్ ఉండాలి అంటూ వితికాని చెడామడా తిట్టాడు. దీంతో ఎపిసోడ్ 45 ముగిసింది. నేటి ఎపిసోడ్‌లోను ఈ టాస్క్ కొనసాగనుండగా, ఇంకెన్ని హింసాత్మక సంఘటనలు జరుగుతాయో చూడాలి.

Related posts