telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

లివర్ ఆరోగ్యం .. వీటితోనే.. !

these foods good to avoid fatty liver

శరీరంలో అధిక కొవ్వు చేరుకుంటే ప్రమాదమే. అయితే అది శరీరంలోకి కొన్ని అవయవాలలో పేరుకుంటే.. ఈ ప్రమాద స్థాయి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. అందులోను, లివర్ లో కొవ్వు పేరుకుంటే ప్రమాదం తీవ్రంగా ఉంటుందంటున్నారు వారు. దీనినే ఫ్యాటీ లివ‌ర్ అంటారు. ఇది రెండు ర‌కాలు. నాన్ ఆల్క‌హాలిక్‌, ఆల్క‌హాలిక్‌. నాన్ ఆల్క‌హాలిక్ అంటే.. ఆల్క‌హాల్ తీసుకోకుండానే వ‌చ్చే ఫ్యాటీ లివ‌ర్‌. ఇక ఆల్క‌హాల్ బాగా తీసుకునేవారికి ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ వ్యాధి వ‌స్తుంది. అయితే ఈ రెండింటిలో ఏ త‌ర‌హా వ్యాధి వ‌చ్చినా ప్ర‌మాదమే. దానితో దీర్ఘకాలంలో లివర్ చెడిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక అలాంటి ప్ర‌మాదం రాకుండా ఉండాలంటే ముందుగానే జాగ్ర‌త్త వ‌హించాలి. డాక్ట‌ర్ వద్ద‌కు వెళ్లి చికిత్స తీసుకోవ‌డంతో పాటు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య నుంచి చాలా త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

* వాల్‌న‌ట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. లివ‌ర్‌లో ఉండే కొవ్వు ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి.

* నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తింటుంటే ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు.

* లివర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచే ఎన్నో పోష‌కాలు బ్రొకొలిలో ఉంటాయి. దీన్ని ఆహారంగా తీసుకుంటే లివ‌ర్ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

* ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉండే చేప‌లు, అవిసె గింజ‌లు, న‌ట్స్‌ను త‌ర‌చూ తింటుంటే ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య త‌గ్గిపోతుంది.

* అవ‌కాడోలను ఆహారంలో భాగం చేసుకున్నా ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఫ్యాటీ లివ‌ర్ స‌మస్య ఉన్న‌వారు ఆల్క‌హాల్ సేవించ‌రాదు. చ‌క్కెర‌, వేపుడు ప‌దార్థాలు, రిఫైన్డ్ నూనెలు, ప‌దార్థాలు, శాచురేటెడ్ కొవ్వుల‌ను తీసుకోకపోవడమే చాలా మంచిది.

Related posts