telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

మార్స్ పై మొదటి అడుగు వేసేది.. మహిళేనట..!

there will be first women on mars

మార్స్ (అరుణ గ్రహం) పైకి ఇప్పటికే అమెరికా, ఇండియాలాంటి దేశాలు స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపించాయి. అక్కడ మనిషి జీవించడానికి అనుకూల వాతావరణం ఉందా లేదా అన్నదానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. అవి పూర్తయితే.. మనిషిని మార్స్‌పైకి పంపించే ప్రణాళికలు కూడా సైంటిస్టులు రచిస్తున్నారు. అయితే మార్స్‌పై తొలిసారి అడుగుపెట్టబోయేది మాత్రం ఓ మహిళే అని అమెరికా అంతరిక్ష పరిధోధన సంస్థ నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్‌స్టెన్ చెప్పారు.

చంద్రుడిపై మరోసారి అడుగుపెట్టబోయే తొలి వ్యక్తి కూడా మహిళే. మార్స్‌పైకి వెళ్లేది కూడా ఓ మహిళే కావచ్చు అని ఆయన అన్నారు. సైన్స్ ఫ్రైడే అనే సైన్స్ అండ్ టెక్నాలజీ రేడియో టాక్ షోలో బ్రైడెన్‌ైస్టెన్ మాట్లాడారు. ఖచ్చితంగా ఎవరు అడుగుపెడతారు అన్నది చెప్పకపోయినా.. నాసా రాబోయే రోజుల్లో చేపట్టనున్న అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో మహిళలే ఎక్కువగా ఉన్న విషయాన్ని ఆయన చెప్పారు. ఈ నెల చివర్లో తొలిసారి కేవలం మహిళా ఆస్ట్రోనాట్లు మాత్రమే స్పేస్‌వాక్ చేయనున్నారు.

ఆనె మెక్‌క్లెయిన్, క్రిస్టినా కోచ్ ఏడు గంటల పాటు సాగే ఈ స్పేస్‌వాక్‌కు సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరూ 2013లో ఆస్ట్రోనాట్‌గా శిక్షణ పొందారు. వీళ్లే కాదు.. ఈ మధ్య నాసా నిర్వహిస్తున్న ఆస్ట్రోనాట్ క్లాస్‌లకు ఎక్కువ సంఖ్యలో మహిళలే వస్తుండటం విశేషం. దీంతో రానున్న రోజుల్లో నాసా ప్రధాన ప్రాజెక్టుల్లో ఈ మహిళలే కీలకపాత్ర పోషించనున్నారు. ప్రస్తుతం మొత్తం నాసా ఆస్ట్రోనాట్లలో 34 శాతం మంది మహిళలే ఉన్నారు.

Related posts