telugu navyamedia
క్రైమ్ వార్తలు

5 రూపాయల డాక్టర్ ఇక లేరు , శోక సంద్రం లో జనం.!!

5Rupees Doctor,JayaChandran

బ్రతికున్నంత వరకు ఎలా బ్రతికాడు రా అని అనిపించుకోడానికి కంటే, ఎట్టా బ్రతికాడు రా అని అనిపించుకోడం లోనే అసలైన గుర్తింపు ఉంది, ఒకరి మరణం 100 మంది కళ్ళలో నీళ్లు తెప్పిస్తే కచ్చితంగా వారు మహానుభావులు కిందికే వస్తారు, తమిళనాడులోని వాషర్‌మెన్‌పేటలో 5 రూపాయల డాక్టర్‌ అనగానే గుర్తుకొచ్చే డాక్టర్‌ జయచంద్రన్‌ ఇకలేరు. పేదల పెన్నిధిగా, పేద ప్రజలకు దశాబ్దాలుగా ఆయన సేవలు అందిస్తూ వచ్చారు, ప్రస్తుతం ఆయన వయసు 71 సంవత్సరాలు, తీవ్ర అనారోగ్యానికి గురి కావడం తో ఆయన్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు, దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్యం మెరుగవ్వలేదు, దీంతో అయన బుధవారం ఉదయం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. అయన మరణం వాషర్‌మెన్‌పేటలో విషాదాన్ని నింపింది.

డాక్టర్‌ జయచంద్రన్‌ గారి సతీమణి డాక్టర్‌ వేణి చెన్నై ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో డీన్‌గా పనిచేసి ఉద్యోగవిరమణ పొందారు. కుమార్తె శరణ్య స్టాన్లీ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు, కుమారుడు శరత్‌ ఓమందూర్‌ ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పతిలో, చిన్న కుమారుడు శరవణన్‌ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు.

జయచంద్రన్‌ గారి స్వస్థలం కాంచీపురం జిల్లాలోని కొడైపట్టినం గ్రామం. 1947లో జయచంద్రన్‌ గారు జన్మించారు. మద్రాసు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చేసి, వాషర్‌మెన్‌పేటలో ప్రైవేటు క్లినిక్‌ పెట్టి పలు దశాబ్దాలుగా పేదలకు వైద్య సేవలందించారు. మొదట్లో డాక్టర్‌ ఫీజుగా రూ.2లు మాత్రమే వసూలు చేసేవారు. నర్సులు, ఇతర సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, ఆయనే అన్ని పనులూ చూసుకునేవారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించి కొంత మంది నర్సులు ఆయన కు ఉచితంగానే సేవలు అందించే వారు.

Related posts