రాజకీయ వార్తలు వార్తలు

జనసేనలో అప్పుడే విరుగుతున్న కుర్చీలు

జనసేన సమావేశాలలో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. రోజు రోజుకు అసంతృప్తులు పెరుగుతున్నారు. అభిమానులలో అసహనం పెరిగిపోతుంది. ఈ రోజు అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన సమావేశం రసభసాగా మారింది.

గుంతకల్లులో జనసేన పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. పార్టీ నేతలు మాట్లాడుతుండగా కొందరు పవన్‌ కల్యాణ్ అభిమానులు ఒక్కసారిగా సమావేశంలోకి దూసుకువచ్చి రచ్చ రచ్చ చేశారు.

పార్టీ నేతలు సమావేశంలో మాట్లాడుతుండగా వచ్చి పవన్‌ కల్యాణ్ అభిమానులు సమావేశాన్ని అడ్డుకున్నారు. తమను ఈ సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని నిలదీశారు. దీంతో గొడవ చెలరేగడంతో అక్కడ ఉన్న కుర్చీలు, ఫర్నిచర్‌ను పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

Related posts

ప్రముఖ పారిశ్రామికవేత్తకు ఝలక్ ఇచ్చి …. రాజకీయనాయకుడితో లేచిపోయిన భార్య

jithu j

ప్రగతిభవన్ ఎదుట ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన!

madhu

జిల్లాకు ఈవీఎంలు…శిక్షణ, ఓటరు నమోదు…శరవేగంగా…

chandra sekkhar

Leave a Comment