telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ

పోలీసుల హెచ్చరిక : నగరంలో .. చోరీ గ్యాంగ్ దిగింది.. జాగర్తగా ఉండాలి…

theft gang into city said police

ఇతర రాష్ట్రాల నుండి వివిధ రకాల చోరీ గ్యాంగ్ లు అనేక దొంగతనాలకు పాల్పడుతున్నాయి. అటువంటి ఒక గ్యాంగ్ నగరంలోకి వచ్చినట్టు తెలుసుకున్న అధికారులు పౌరులను జాగర్తగా ఉండాల్సిందిగా హెచ్చరికలు జారీచేశారు. ఆగిఉన్న వాహనాలు, ఏటీఎం సెంటర్లే వాళ్ల టార్గెట్. ఏటీఎం కేంద్రాల వద్ద ప్రజల దృష్టి మరల్చి నగదును, వాహనాల అద్దాలను ధ్వంసం చేసి విలువైన వస్తువులను దోచుకుంటారు. ఈ తరహా దోపిడీలకు పాల్పడుతున్న రామ్ జీ ముఠా కర్నూలులో అడుగుపెట్టిందని పోలీసులు తెలిపారు. రెండ్రోజుల క్రితం నగరంలోని మౌర్యా ఇన్ హోటల్ వద్ద ఆపిన కారులో నగదును ఈ ముఠానే అపహరించిందని వ్యాఖ్యానించారు. పార్కింగ్ చేసిన కార్ల అద్దాలను ధ్వంసం చేసి వీరు చోరీలకు పాల్పడుతారని పేర్కొన్నారు.

ఈ గ్యాంగ్ తమిళనాడు నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తుందని వ్యాఖ్యానించారు. రామ్ జీ గ్యాంగ్ నగరంలోకి అడుగుపెట్టినట్లు తమ వద్ద ప్రాథమిక సమాచారం ఉందని తెలిపారు. కొత్త వ్యక్తుల మాటలు నమ్మవద్దనీ, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగదు, నగలు, విలువైన వస్తువులను బ్యాంకుల్లో దాచుకోవాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ యాప్(ఎల్ హెచ్ఎంఎస్) ను వినియోగించుకోవాలని చెప్పారు.

Related posts