telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో మళ్ళీ థియేటర్లు బంద్…

గతేడాది కరోనా కారణంగా థియేటర్లు బంద్ అయ్యాయి. చిత్రపరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపధ్యంలో కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ కాటు వేసింది. తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. సినిమా ప్రదర్శనలను నిలిపి వేయనున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. కొవిడ్ ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా థియేటర్లు, మల్టీ ఫ్లెక్స్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘వకీల్ సాబ్’ తప్ప వేరే ఏ సినిమా థియేటర్లలో కనిపించటం లేదు. దీంతో థియేటర్లను స్వచ్ఛందంగా మూసి వేయడానికి రెడీ అయినట్లు సమాచారం రాష్ట్రంలో కరోనా వ్యాప్తితీవ్రత దృష్ట్యా సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రేపటి నుంచి థియేటర్లు మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే వకీల్‌సాబ్‌ సినిమా ప్రదర్శించే థియేటర్లకు మాత్రం మూసివేత నుంచి మినహాయించినట్లు ఎగ్జిబిటర్లు తెలిపారు.

Related posts