telugu navyamedia
telugu cinema news trending

విశాల్ కొత్త సినిమా “చక్ర”

Chakra

త‌మిళ హీరో విశాల్ వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా అలా విడుదలవుతుందో లేదో మరో సినిమాను ప్రకటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. విశాల్ న‌టించిన “యాక్ష‌న్” చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈరోజు మూడు చిత్రాలు విడుదల కాగా … యాక్షన్ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. మరి కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం దుమ్మురేపుతుందేమో చూడాలి. ఇక కొద్ది సేప‌టి క్రితం తను చేస్తున్న తాజా చిత్రంకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశాడు. “చ‌క్ర” అనే టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, ఈ సినిమాని విశాల్ నిర్మిస్తున్నారు. ఎమ్ ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రెజీనా కాసాండ్రా, శ్ర‌ద్ధ శ్రీనాద్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. తాజాగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌ని చూస్తుంటే ఈ చిత్రం కూడా యాక్ష‌న్ అడ్వెంచెర‌స్ మూవీగా రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది.

Related posts

హువావే .. మైమాంగ్ 8 స్మార్ట్‌ఫోన్ .. ఆకట్టుకునే ఫీచర్లు ..

vimala p

టీడీపీకి మద్దతుగా.. మహేష్ బాబు.. ఒక్కటైన ఎన్టీఆర్, కృష్ణ అభిమానులు..

vimala p

పిల్లలు ఆకలి లేదు.. అంటున్నారా.. ఇలా చేస్తే సరి..!

vimala p