telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లండన్లో “బాహుబలి” టీం… ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు

Rajamouli

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా సునామీ సృష్టించడమే కాకుండా… బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, కీరవాణి.. టీమ్ వర్క్‌తో ఖండాంతరాల్లో తెలుగు పరిశ్రమ గొప్ప ఘనత సాధించింది. ఇప్పుడు మళ్లీ ఆ సినిమా టీమంతా లండన్‌లో ఒకే వేదికపై సందడి చేయనుంది. తాజాగా ఈ చిత్రబృందం లండన్ వేదికగా మరోసారి కలిసింది. లండన్‌లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఈ రోజు (శనివారం) ‘బాహుబలి-1’ను ప్రదర్శించనున్నారు. ఈ సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే సంగీత దర్శకుడు కీరవాణి సంగీత ప్రదర్శన ఉండబోతోంది. ఈ సంద‌ర్భంగా బాహుబ‌లి మెయిన్ టీమ్ ప్ర‌భాస్‌, అనుష్క‌, రాజ‌మౌళి,రానా, శోభు యార్ల‌గ‌డ్డ త‌దిత‌రులు లండ‌న్ చేరుకున్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ “రాయ‌ల్ రీ యూనియ‌న్ ఆఫ్ బాహుబ‌లి” రాజ‌మౌళి మెసేజ్ పోస్ట్ చేశారు. ఫొటోను షేర్ చేశారు. అక్కడ దిగిన ఫోటోలను రాజమౌళి, రానా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, ఈ నెల 13న ప్రభాస్ జన్మదినోత్సవం. పుట్టినరోజు వేడుకలను ప్రభాస్ లండన్‌లోనే జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకలు ముగిసే వరకు రాజమౌళితోపాటు ‘బాహుబలి’ టీమ్ లండన్‌లోనే ఉంటుందని సమాచారం.

Related posts