telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

నటనే ముద్దు .. రెజ్లింగ్ వద్దు అంటున్న ‘ది రాక్’ ..

the rock out from wrestling can act

‘ది రాక్‌(డ్వేన్‌ జాన్సన్‌)’ డబ్ల్యూడబ్ల్యూఈ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి. రింగ్‌లోకి దిగిన ‘ది రాక్‌’ను చూస్తే.. ప్రత్యర్థి ఎవరైనా భయంతోనే సగం చచ్చిపోతాడు. ఆయన పంచ్‌లో బేస్ ఆ రేంజ్‌లో ఉంటుంది. అయితే, ఇక నుంచి ఆయన రెజ్లింగ్‌కు దూరం కాబోతున్నారు. నటుడిగా మారిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి దూరమైన డ్వేన్‌ జాన్సన్‌ ఇక ప్రొఫెషనల్‌ రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పేశాడు. జాన్సన్‌ తన చివరి మ్యాచ్‌ను 2006లో ఎరిక్‌ రోవన్‌తో తలపడ్డాడు.

డ్వేన్‌ జాన్సన్‌ 1972 మే2న కాలిఫోర్నియాలో ప్రముఖ రెజ్లర్‌ రాకీ జాన్సన్‌, అటా జాన్సన్‌ దంపతులకు జన్మించాడు. కొంతకాలం తల్లి కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌లో పెరిగాడు. ఫుట్‌బాల్‌ క్రీడాకారుడిగా కెరీర్‌ను ప్రారంభించిన జాన్సన్‌ ఆ తర్వాత ప్రొఫెషనల్‌ రెజ్లింగ్‌ వైపు మొగ్గు చూపాడు. దాన్నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. 1996లో జరిగిన యూఎస్‌డబ్ల్యూఏ ట్యాగ్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించడంతో డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ జాన్సన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడి నుంచి జాన్సన్‌ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అనేక ఛాంపియన్‌షిప్‌లు సాధించిన ‘ది రాక్‌’ 1999లో ‘బియాండ్‌ ది మ్యాట్‌’ అనే డాక్యుమెంటరీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన నటనకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం గమనార్షం.

Related posts