telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు వ్యాపార వార్తలు

టాప్ 200 వర్సిటీ లలో.. 49 మనవే… టీహెచ్ఈ ర్యాంకింగ్స్

the rakings 2019 released

ప్రతియేటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్ ఇస్తూ, అత్యుత్తమమైన వాటిని 200 వరకు ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది కూడా, టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (టీహెచ్‌ఈ) విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్‌లు ప్రకటించింది. 43 దేశాలకు చెందిన 450 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్‌లు ప్రకటించగా భారత్‌కు చెందిన 49 వర్సిటీలు టాప్‌ 200లో స్థానం సంపాదించాయి.

ర్యాంకింగ్స్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (బెంగుళూరు) 14వ స్థానం, ఐఐటీ (బొంబాయి) 27వ స్థానం, ఐఐటీ (రూర్కీ) 35వ స్థానం, ఐఐటీ (ఇండోర్‌) 61వ స్థానం, జేఎస్‌ఎస్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ 64వ స్థానంలో నిలిచాయి. సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీ, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, అమృతా యూనివర్సిటీ ఈసారి టాప్‌ 150లో స్థానం సంపాదించాయి. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ పూణే, ఐఐటీ(హైదరాబాద్‌) తొలిసారిగా ర్యాంకింగ్‌లో చోటు సంపాదించాయి. 2018లో భారత్‌ నుంచి 42 వర్సిటీలు స్థానం సంపాదించగా ఈసారి అది 49కి పెరిగింది.

మొదటి ఐదు స్థానాల్లో చైనాకు చెందిన వర్సిటీలు ఉన్నాయి. జాబితాలో మొత్తం 72 వర్సిటీలతో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత వర్సిటీల్లో విద్యాబోధన మెరుగుపడినా, ప్రమాణాలతో పోలిస్తే వెనకబడే ఉన్నాయని టీహెచ్‌ఈ ఎడిటర్‌ ఎల్లీ బోత్‌వెల్‌ తెలిపారు.

Related posts