telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు అర్జున్ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టిన టబు

AA19

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 19వ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హారికా హాసినీ, గీతా ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు “అల‌క‌నంద‌” అనే టైటిల్ అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో సుశాంత్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ ట‌బు ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లోకి ట‌బు అడుగు పెట్టారు. ఈ సినిమాలో ట‌బు లుక్‌కు సంబంధించిన వీడియోను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. అలాగే ట‌బుకు గ్రాండ్ వెల్క‌మ్ చెప్పింది. టాప్ ఆర్టిస్ట్‌లు అంద‌రు ఈ చిత్రంలో భాగం అవుతుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు పెరుగుతున్నాయి.

Related posts