telugu navyamedia
culture health Sexual Problems trending

డేటింగ్ చేస్తున్నారా ?… అమ్మాయిలూ ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Dating

డేటింగ్ అనేది ఆ కాలంలో సాధారణమై పోయింది. అయితే ఈ లవ్, బ్రేకప్ విషయంలో అమ్మాయిలు ఎక్కువగా మానసిక వేదనకు గురవుతుంటారు. అబ్బాయిలు కూడా బాధ పడతారు. కానీ చాలా తక్కువ మంది. ఇక్కడ అబ్బాయిలకు ఎక్కువ బాధా ? లేక అమ్మాయిలకు ఎక్కువ బాధా ? అనే విషయం పక్కన పెడితే… అమ్మాయిలు డేటింగ్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే తరువాత బాధ పడాల్సిన పని ఉండదని సూచిస్తున్నారు సైకాలజిస్టులు.

1. మీరు డేటింగ్‌కు ఎంచుకోవాలనుకునే అబ్బాయి కొత్త ప్రయత్నాలు చేయకుండా అన్నీ ఏకపక్ష చర్యలకే ప్రాధాన్యమిస్తుంటే అలాంటి వ్యక్తిని దూరంగా పెట్టండి.

2. అమ్మాయిలు వంటింటికే పరిమితం అనే చందంగా మాట్లాడేవారి జోలికి అస్సలు పోకూడదు.

3. ఎప్పుడూ తాము కొన్న వస్తువుల ధరలు, హోటల్ తిండి ఖర్చులు గురించి పదేపదే ప్రస్తావించేవారితో చాలా కష్టం. డేటింగ్ చేసినన్నాళ్ళూ వీరు మరింత పిసినారితనంతో ప్రవర్తిస్తారన్న దానికి అవి సంకేతాలు.

4. స్పోర్ట్స్ చూసేందుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే అబ్బాయిలు ఓ అనుబంధం పట్ల, కుటుంబం పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఎన్నడూ పట్టించుకోరు. ఇవి వారు బాల్య పోకడల నుంచి బయటపడలేదన్న విషయాన్ని సూచిస్తాయి.

5. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి క్షణం నిఘా వేసే వ్యక్తికి దూరంగా ఉండాలి. బయటికెళితే ఎవరితో తిరుగుతోంది? ఏం చేస్తోంది? వంటి అనుమానాలతో వేగిపోయే మగవాణ్ణి ఎంత దూరం పెడితే అంత మంచిది.

6. బంధం పట్ల అవగాహన లేకుండా చపలచిత్తం ప్రదర్శిస్తుంటారు కొందరు. ఓసారి అనుబంధం కొనసాగించాలని, మరోసారి పిల్లలు కావాలని అంటుంటారు… రెణ్నెల్ల తర్వాత అసలేదీ తేల్చుకోలేకపోతారు. వీరితోనూ జాగ్రత్తగా ఉండాలని మానసిక నిపుణులు అంటున్నారు.

Related posts

రనుమండల్ పై లతా మంగేష్కర్ వ్యాఖ్యలు… హిమేష్ రేష్మియా మద్ధతు

vimala p

తెలంగాణలో భానుడి ప్రతాపం.. వడదెబ్బకు 16 మంది మృతి

vimala p

మోడీ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తే.. అందరి ముందే పట్టుకుంటా.. : పవన్

vimala p