telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉప్పెన నుంచి మరో లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌

పంజా వైష్ణవ్ తేజ్‌, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘ఉప్పెన‌’. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘ఉప్పెన‌’కు దర్శకత్వం వహించడంతో పాటు క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను కూడా బుచ్చిబాబే అందించారు. త‌మిళ స్టార్ యాక్టర్ విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. ఈ టీజర్‌ విడుదల కాగానే మంచి రెస్పాన్స్‌ వస్తోంది.అయితే.. తాజాగా ఈ “ఉప్పెన” సినిమా నుంచి జల జల జలపాతం నువ్వు అనే లిరికల్‌ సాంగ్‌ ఇవాళ రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ఈ సాంగ్‌లో వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి మధ్య రొమాంటిక్‌ యాంగిల్‌ బాగా వర్కౌట్‌ అయింది. ఈ సాంగ్‌ రిలీజ్‌ కాగానే వ్యూస్‌ కూడా విపరీతంగా వస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. 

Related posts