telugu navyamedia
సినిమా వార్తలు

వసూళ్ళ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్న “లయన్ కింగ్”

The-Lion-King

హాలీవుడ్ సినిమాలు తెలుగులో కూడా విడుదలై అద్భుతమైన వసూళ్లను అందుకుంటున్నాయి. తాజాగా హాలీవుడ్ మూవీ “ద ల‌య‌న్ కింగ్‌” కూడా ఇండియాలో అద్భుతమైన వసూళ్ళను రాబట్టింది. ముఖ్యంగా ఫ్యామిలీస్ ఈ చిత్రాన్ని బాగా ఆదరించారు. ఈ హాలీవుడ్ బిగ్ బడ్జెట్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫిల్మ్ అందరూ భావించినట్టుగానే ఇండియాలో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ బయ్యర్స్ కి మంచి లాభాలనే అందించింది. గత నెల 19 భారతదేశ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది లయన్ కింగ్ ఇంగ్లీష్ తో పాటు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఫస్ట్ వీకెండ్ మూడు రోజుల్లోనే 50కోట్ల వసూళ్లను అందుకున్న ఈ సినిమా 10 రోజుల్లో 100కోట్లను దాటింది. ఇక నాలుగవ వారానికి కూడా అదే ఫ్లోలో కలక్షన్స్ అందుకొని మొత్తంగా 24వ రోజుకి అన్ని భాషల్లో కలిపి 150 కోట్లను దాటింది. ఇటీవల శని, ఆదివారాల్లో కూడా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ మద్దతుతో మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగులో నాని – బ్రహ్మానందం – అలీ – జగపతి బాబు – అరుంధతి రవి శంకర్ వంటి స్టార్స్ డబ్బింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా లయన్ కింగ్ మంచి వసూళ్లను రాబట్టి బయ్యర్లకు ప్రాఫిట్స్ ని అందించినట్లు సమాచారం.

Related posts