telugu navyamedia
telugu cinema news trending

బిత్తిరి సత్తి ఆ ఛానెల్ నుంచి ఎందుకు వెళ్లిపోయాడంటే… సంచలన విషయాలు వెల్లడించిన సత్తి

Satthi

బిత్తిరి సత్తి ఉరఫ్ రవికుమార్ ఈయన ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఫేమస్. ఓ సాధారణ యాంకర్‌గా మొదలైన బిత్తిరి సత్తి ప్రయాణం ఇప్పుడు చాలా దూరం వెళ్లిపోయింది. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ నుంచి ఈయన జర్నీ మొదలైంది. తన న్యూస్ చదువుకుని, తీన్మార్ స్టెప్పులు వేయించి వెళ్లిపోయే సత్తి ఇప్పుడు తనే న్యూస్ అయిపోయాడు. ఉన్నట్లుండి ఛానెల్ మారిపోయి.. మరో ఛానెల్ వెళ్లి అక్కడ పాత వైభవం చూపించలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు పాపం. ఇదే సమయంలో తుపాకి రాముడు అంటూ సినిమా కూడా చేసాడు. ఇది అక్టోబర్ 25న విడుదల కానుంది. తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా కూడా బిత్తిరి సత్తి ఆ ఛానెల్ నుంచి ఎందుకు వెళ్లిపోయాడు ? మరో ఛానెల్‌లో ఎందుకు చేరిపోయాడు ? అనేది చాలా మందిలో ఉన్న అనుమానం. ఈ మధ్యే ఓ యూ ట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు సత్తి. తాను ఆ ఛానెల్ నుంచి బయటికి రావడానికి కారణం ఇదివరకు ఉన్న గౌరవం కానీ, మర్యాద కానీ, ఇంపార్టెన్స్ కానీ ఇప్పుడు లేవని, తనకు లైఫ్ ఇచ్చిన ఛానెల్ నుంచి బయటికి రావడానికి చాలా ఆలోచించానని, అయితే వాటికి పక్కా కారణాలున్నాయి కాబట్టే వచ్చానని చెప్పాడు సత్తి. ఆ ఛానెల్లో ఓ సారి తనను కొట్టారని సంచలన నిజాలు బయటపెట్టాడు. సత్తి డబ్బులు ఎక్కువ అడిగాడు అందుకే వద్దనుకున్నారని బయట వినిపిస్తుంది కదా అంటే… ఎవరికి వద్దు డబ్బులు.. మీకు టీఆర్పీలు ఇవ్వాలి కానీ నాకు డబ్బులు వద్దా అంటున్నాడు. ఛానెల్ మారిన తర్వాత ఒకప్పుడు ఉన్న ఇమేజ్ ఇప్పుడు లేదు కదా నిజంగా చెప్పు సత్తి అంటే అయ్యుండొచ్చు కానీ నా టాలెంట్ నాకు ఉంది కదా అంటున్నాడు ఈ కమెడియన్ కమ్ యాంకర్. మొత్తానికి సత్తి చెప్పిన నిజాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related posts

బెంగాలీ ఎంపీల డ్యాన్స్ వీడియో వైరల్

vimala p

విజ‌యవాడ నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నా: వ‌ర్మ‌

vimala p

టీడీపీకి యామిని సాధినేని .. రాజీనామా..

vimala p