telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పంజరంలోని రామచిలుక వదిలేయండి… లేదంటే… ఉపాసన హెచ్చరిక

Upasana

రామచిలుక ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఇలాంటి అందమైన పక్షి జాతిని సంరక్షించే ఉద్దేశంతో ఉపాసన కొణిదెల ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.రామచిలుక ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఇలాంటి అందమైన పక్షి జాతిని సంరక్షించే ఉద్దేశంతో ఉపాసన కొణిదెల ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక. ఇలాంటి వన్యప్రాణుల సంరక్షణకు ఆమె నడుం కట్టిన సంగతి తెలిసిందే. రామచిలుకను పంజరంలో బంధిస్తే 5000 జరిమానా పడుతుందని, ఆరేళ్ల జైలు శిక్ష పడుతుందని ఆమె ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. రామచిలుక ఎగరడానికి పుట్టింది.. అంతేకానీ మీరు జాతకాలు చెప్పించుకోవడానికో, మీకు వినోదాన్ని అందించడానికో కాదు. అందుకే పంజరంలోని రామచిలుకను బయటకు వదిలేలా చూడండి, అలాంటి సమాచారం మీ దగ్గర ఉంటే మాకు తెలియజేయండి అని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts