telugu navyamedia
సినిమా వార్తలు

ఆసక్తికరంగా “జార్జి రెడ్డి” ఫస్ట్ లుక్

George-Reddy

గతంలో ‘దళం’ సినిమాతో విభిన్నమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న జీవన్ రెడ్డి “జార్జిరెడ్డి” చిత్రానికి దర్శకుడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసింది ఈ సినిమా యూనిట్. ఈ లుక్‌లో జార్జ్ రెడ్డి సినిమా బయోపిక్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఒక కమర్షియల్ హీరో తెరమీర చేసే సాహసాలన్నీజార్జ్ నిజజీవితంలో చేసినట్టు ఈ లుక్‌ను చూస్తే అర్థమవుతోంది. చరిత్ర మరిచిపోయిన లీడర్ అనే విషయాన్ని పోస్టర్ లో‌నే చెప్పారు. 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్సీటీలో చదువుకున్న ప్రతీ విద్యార్థికి జార్జ్ జీవితం గురించి తెలుసు. కానీ ఈ తరానికి జార్జ్ లాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి తెలుసుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఓ ఫర్ గాటెన్ లీడర్ కథను తీసుకు వస్తోన్న ఈ టీమ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఒక్కసారిగా సినిమాపై ఆసక్తిని పెంచింది. 1960, 70 లలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను కల్లకు కట్టబోతున్న ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్‌తో కలిసి త్రీ లైన్స్, సిల్లీ మాంక్స్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘వంగవీటి’ ఫేం సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ హీరో సత్యదేవ్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక ‘జార్జి రెడ్డి’ తల్లి పాత్రలో నటిస్తుండటం విశేషం.

జార్జిరెడ్డి.. దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు అది. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జార్జిరెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్‌లోనే హత్య చేశారు. నేటి తరంలో చాలా మందికి తెలియని వ్యక్తి జార్జ్. ఎందరో విద్యార్థులను కదిలించిన వ్యక్తి. అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది.

Related posts