telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సామ్ జామ్” కోసం సమంత భారీ కటౌట్… వీడియో వైరల్

Sam

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ బిగ్‌బాస్ షో ద్వారా తొలిసారి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించి అభిమానుల‌ను అల‌రించారు. ఇక ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఓకే చెప్పిన సామ్.. హోస్టుగా కూడా సత్తా చాటాలని కుతూహలంగా ఉంది. అయితే ఇప్పుడు ఆహా కోసం ఫుల్ టైమ్ హోస్ట్‌గా మారింది. ‘సామ్‌జామ్‌’ పేరుతో ‘ఆహా’ ఓటీటీలో రానున్న ఈ టాక్‌షోకు సామ్ ప్ర‌యోక్త‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, దీనికి సంబంధించిన తొలి ఎపిసోడ్‌ ఈ నెల 13న ప్రసారం కానుంది. “సామ్ జామ్” షోకు సంబంధించి జోరుగా ప్ర‌చారాలు మొద‌లు పెట్టింది ఆహా టీం. ఇందులో భాగంగా ఆహా వ్యవస్థాపకులు అల్లు అరవింద్, అందాల భామ స‌మంత‌ సమక్షంలో భారీ కటౌట్‌ని లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని ఆహా త‌న ట్విట్ట‌ర్‌లో కొద్ది సేపటి క్రితం షేర్ చేసింది. ఇందులో త‌న కటౌట్‌ని చూసిన స‌మంత తెగ మురిసిపోయింది.

Related posts