రాజకీయ వార్తలు సమీక్ష వార్తలు సామాజిక

అహింసా చట్టం…?

దేశ శిక్షాస్మృతి ఉన్న రాజ్యాంగాన్ని వక్రంగా ఉపయోగించుకొని భ్రష్టు పట్టిస్తున్న రాజకీయనాయకులను చూసి భారతీయుడు వాడి రాజ్యాంగాన్ని వాడే నిర్మించుకుంటున్నాడా…అటువంటి ఓ రాజ్యాంగంలోనిదే ఈ చట్టం.

ఎవరైనా సరే వారి తప్పుల ఖాతా ‘సున్నా’ తో ఉండాలి, లేదనో కాదనో ఆ నెంబర్ దాటి ‘ఒకటి’ అయితే ‘శిక్షాస్మృతి’…తప్పు జరిగిన అర్ధ గంటలో సాక్ష్యాలతో తప్పు చేసిన వారి ఇంటి తలుపు తడుతుంది లేదా సదరు నేరస్తులను వారి ఆధీనంలోకి తీసుకోని శిక్షించడం మొదలుపెడుతుంది.

శిక్షాస్మృతి కి పై అధికారి ఎవరు ఉండరు. ఓ రాష్ట్రపతో లేదా ప్రధానో సదరు దోషులకు క్షమాబిక్ష పెట్టె అవకాశం ఉండదు. ఒక్కసారి శిక్షాస్మృతి కి నేరస్తుడు వస్తే శిక్ష అనుభవించడం తప్ప వేరే అవకాశం ఏదీ ఉండదు.

ఇక శిక్ష విషయానికి వస్తే, సదరు నేరస్తుడితో పాటు వాని కుటుంబాన్ని కూడా నేరస్తులుగా పరిగణించబడతారు (ఇలా పరిగణించడానికి కారణం : ఆ నేరస్తుని కుటుంబసభ్యులు ఆతని వారించి మార్చలేకపోయినందుకు, ఒక వేళ వారు ఆతని వారించలేని స్థితి ఉంటె ఆ సభ్యునిపై దగ్గరలోని రక్షణ శాఖలో ఆ వ్యక్తి తప్పులకు మేము భాద్యులము కాము అని పిర్యాదు చేసి ఉండాలి, అప్పుడే సదరు కుటుంబం శిక్ష పరిగణలోకి రాదు).

ఇక నేరస్తుని ఆస్తులు, నగదు, ఇలా అన్ని (ఒంటిపై శిక్షాస్మృతి ఇచ్చిన అతి తక్కువ ఖరీదైన వస్త్రాలు తప్ప) స్వాధీనం చేసుకోబడతాయి. నేరస్తుల కు నియమాలు : వారు ఎవరితో మాట్లాడరాదు, నవ్వరాదు, ఏడవరాదు, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోరాదు, నించోరాదు, అడుక్కోరాదు, అందరూ(ఒక వేళ కుటుంబం అంతా శిక్షను అనుభవిస్తుంటే) ఒకే చోట ఉండరాదు. వీరికి ఎవరైనా ఒక ముద్ద బిక్షగా వేస్తె తినాలి అంతే. వీరిపై ఎవరైనా జాలిపడి వారి ఇంటిలో పని ఇస్తే ఇవ్వవచ్చు కానీ పని ఇచ్చిన వారి ఇంటిలో ఏ ప్రమాదమైన సంభవిస్తే ఏ శాఖ కూడా స్పందించాడు. నేరస్తులు దేశాన్ని విడిచి వెళ్లనివ్వం, ఒక వేళ వెళితే…(ముందే ఈ చట్టాన్ని ప్రపంచ దేశాలకు తెలియచేస్తాం, ఈ చట్ట ప్రకారం నేరస్తులు వేరే దేశం వెడితే వారిని తీవ్ర వాదులుగా పరిగణిస్తాం, అట్టి తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దేశాలను తీవ్రవాద దేశాలుగా పరిగణించబడతాయి అని ఈ చట్టంలో ఉంటుంది) ఆ దేశం మళ్ళీ భారతదేశానికి అప్పగించాలి కానీ ఆశ్రయం(ఒక్క రోజు కూడా) ఇవ్వరాదు.

ఈ శిక్షలో రక్తం చిందుడు కానీ నేరస్తుని బ్రతనివ్వం, చావనివ్వం. అంటే…నేరస్తులను హింసించడానికే ఓ సేన విభాగం పనిచేస్తుంది, ఈ విభాగం పేరు ‘రాక్షస సేన’, ఒక్క అఘాయిత్యం తప్ప ఏమైనా చేసుకోవచ్చు. ఉదాహరణకి, నేరస్తునిపై జాలిపడి ఎవరైనా ఒక ముద్ద బిక్ష పడేస్తే ఆ ముద్దను కూడా తినివ్వకుండా ఈ రాక్షస సేన అడ్డుపడొచ్చు.

ఇదే – అహింసా హింస – చట్టం.

శిక్షాస్మృతి : ప్రకారంగా నేరస్తులకు సర్వ హక్కులు రద్దు చేయబడతాయి. వాళ్ళకి ఏ మానవ హక్కులు ఉండవు, అలాగే భారతీయులుగా కూడా హక్కులు ఉండవు, వారిని బ్రతకడానికి హక్కులేని జీవులుగా మాత్రమే పరిగణిస్తుంది.

అభివృద్ధి ఫలాలు అందుకే ఇంకా అందలేదు…

Related posts

ఏపీ జర్నలిస్టులకు ప్రభుత్వం శుభవార్త!

madhu

జగన్ స్థావరంలో… టీడీపీ ధర్మపోరాట సభ… నేడే.. అడ్డుకుంటాం అంటున్న.. ప్రతిపక్షం..

chandra sekkhar

అశోక్ గజపతి రాజు మాతృమూర్తి ఇక లేరు

admin

Leave a Comment