క్రైమ్ వార్తలు

శ్రీనివాస్ కూచిబొట్ల కేసు.. నేరం అంగీకరించిన నిందితుడు

అమెరికాలోని కాన్సన్ నగరంలో సంచలనం రేపిన ప్రవాస భారతీయుడు  శ్రీనివాస్ కూచిబొట్లను కాల్చి చంపిన కేసులో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు ఆడం పురింటన్‌ కోర్టులో తానే కాల్చి చంపానని నేరాన్ని అంగీకరించడంతో కోర్టు అతడికి మే 4వ తేదీన శిక్షను ఖరారు చేయనుంది. 
 
నిందితుడు ఈ హత్యను పథకం ప్రకారం చేసినందుకుగాను అతనికి పెరోల్‌ లేకుండా 50 ఏళ్ల వరకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశముందని అంటున్నారు న్యాయ నిపుణులు. 
 
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన తర్వాత ఆ దేశమంతటా విదేశీయులపై విద్వేషం వ్యక్తమైన నేపథ్యంలో కాన్సస్‌ నగరంలో శ్రీనివాస్‌ కూచిభొట్ల, అతని స్నేహితుడు అలోక్‌ మాదసానిపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్‌ కూచిభొట్ల ప్రాణాలు విడువగా అలోక్‌, ఇయాన్‌ గాయాలపాలయ్యారు.
 
తాజాగా నిందితుడు నేరం అంగీకరించిన నేపథ్యంలో శ్రీనివాస్ కూచిబొట్ల భార్య సునయన స్పందించింది.  మనుషులంతా పరస్పరం  ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి  తప్ప ద్వేషించుకోకూడదు. అది ఎప్పటికి ఆమోదయోగ్యం కాదని ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 

Related posts

వావ్ మృతదేహానికి 3రోజులు పరీక్షలు… 8లక్షలు టోకరా… చివరకు ఇలా

nagaraj chanti

భిలాయ్ ఉక్కు కర్మాగారంలో … పెను ప్రమాదం..9 మృతి…

chandra sekkhar

శుభకార్యానికి ఇంటికి వచ్చి … మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న జవాను

jithu j

Leave a Comment