telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

మహిళల కోసం తరుణి మెట్రో స్టేషన్‌..

Tharuni Ladies Special Metro Station

హైదరాబాద్ నగరంలోని మధురానగర్‌ మెట్రో స్టేషన్‌ ను మహిళల కోసం ‘తరుణి మెట్రో స్టేషన్‌’గా నిర్ణయించినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఈ స్టేషన్‌లో స్టేషన్‌లోని దుకాణాలను సైతం మహిళలే నిర్వహిస్తారన్నారు. చిన్నారులకు అవసరమైన అన్ని రకాల దుస్తులు, వస్తువులు, సౌకర్యాలను మహిళలే కల్పిస్తారని తెలిపారు. నగర మెట్రో ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్‌ పార్కింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం కోసం ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యమెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్‌ వాహనాలకు ఛార్జింగ్‌ చేసే సదుపాయం కల్పించడం, మల్టీ లెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్సుల నిర్మాణం వంటి అంశాలకు నూతన సంవత్సరంలో పెద్దపీఠ వేస్తామన్నారు. మెట్రో సిబ్బంది కృషివల్లే ఇప్పటివరకు నగర మెట్రో ప్రాజెక్టు 72 జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులను సాధించిందన్నారు.

t

Related posts