telugu navyamedia
సినిమా వార్తలు

ఆటో డ్రైవర్లకు విజయ్ విందు, కానుకలు

Vijay-Kind-Gesture-to-Auto-Drivers

ప్రముఖ తమిళ నటుడు విజయ్ ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తన అభిమాన ఆటో డ్రైవర్లకు భారీ ఎత్తున విందు ఇవ్వడంతో పాటు కానుకలు అందజేశారు. ఇళయ దళపతి విజయ్ ప్రతీ సంవత్సరం కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ సారి ఈ కార్యక్రమం కొంచెం లేటుగా జరిగింది. హీరో విజయ్ నిర్వహించిన ఈ విందు కార్యక్రమం ట్విట్టర్‌లో ట్రెండ్‌గా మారింది. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను విజయ్ సెక్రటరీ బస్సీ ఆనంద్ చేపట్టారు. కాగా విజయ్ ప్రస్తుతం “దళపతి” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Related posts