telugu navyamedia
news telugu cinema news

వచ్చే ఏడాది ఆ రూల్ పాటిస్తా అంటున్న విజయ్…

Vijay

ఇళయదళపతి విజయ్ కి తమిళ్ లో ఉన్న క్రేజ్ తెలుగులో కూడా ఉంది. అయితే ప్రతి ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. ఈ ఏడాది కూడా రెండు సినిమాలతో రావాల్సిన విజయ్ కేవలం ఒక్క సినిమాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది కూడా ఇంకా విడుదల అవ్వలేదు. అదే మాస్టర్ సినిమా. మాస్టర్‌ను ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఏడాది ఎలా అయినా విడుదల చేయాలని ఆలోచించానా లాభం లేదు. థియేటర్లు తెరుచుకునే సరికి ఈ ఏడాది పూర్తవేతుంది. దాంతో వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే విజయ్ ప్రస్తుతం నెల్స్ దిలీప్ దర్శకత్వంలో మరో సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది మిస్ అయినా వచ్చే ఏడాది విజయ్ తప్పకుండా రెండు సినిమాలు విడుదల చేయనున్నాడు. అయితే మాస్టర్ సినిమా కాకుండా అన్ని అనుకున్నట్లు జరిగితే మరో సినిమాను కూడా విడుదలకు సిద్దం చేసే అవకాశాలున్నాయి. చూడాలి మరి ఈ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయి అనేది.

Related posts

ఎండాకాలం పాదాలు పగులుతున్నాయా.. అయితే ఇలా చేయండి!

Vasishta Reddy

టీటీడీ ఆస్తుల వేలానికెళ్తే.. మళ్లీ కోర్టులకు వెళ్లొచ్చు: టీజీ వెంకటేశ్

vimala p

శృతి హాసన్‌కు కలిసొచ్చిన పోలీసోడు

Vasishta Reddy