telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారీ విరాళం ప్రకటించిన తమిళ హీరో విజయ్

Vijay

క‌రోనా ప్రభావంతో లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. కొందరు నగదును సాయంగా ప్రకటిస్తుంటే, మరి కొందరు స్వయంగా పేదలకు ఆహారం, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందిస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు తమిళ హీరో విజయ్ మాత్రం విరాళం ప్రకటించలేదు. దాంతో ఈయనపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు వాటికి సమాధానం చెబుతూ ఎట్టకేలకు ఈయన కూడా విరాళం ప్రకటించాడు. కోటి 30 లక్షల విరాళం అందిస్తున్నట్లు అనౌన్స్ చేసాడు విజయ్. అందులో తమిళనాడు మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈయన సాయం ప్రకటించడం గమనార్హం. ఈ మధ్య తెలుగులో కూడా విజయ్ సినిమాలు బాగానే ఆడుతున్నాయి. దాంతో ఇక్కడి ముఖ్యమంత్రుల సహాయ నిధికి కూడా విజయ్ విరాళం అందించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 5 లక్షలు ఇచ్చిన ఈయన.. కర్ణాటక, పాండిచ్చేరి ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షలు.. కేరళ ప్రభుత్వానికి 10 లక్షలు.. ఫిల్మ్ ఫెడరేషన్‌కు 25 లక్షలు.. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు.. ప్రధాన మంత్రి సహాయ నిధికి 25 లక్షలు అనౌన్స్ చేసాడు విజయ్. ప్రస్తుతం ఈయన మాస్టర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

Related posts