telugu navyamedia
సినిమా వార్తలు

60వ సినిమాకు సిద్ధమైన స్టార్ హీరో

Ajith

కోలీవుడ్ స్టార్ హీరో త‌ల అజిత్ ఈ ఏడాది మొద‌ట్లో “విశ్వాసం” చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల అజిత్ “నెర్కొండ పార్వాయి” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం “పింక్” హిందీ రీమేక్‌గా తెర‌కెక్కి ఘన విజ‌యం సాధించింది. ఈ ఏడాది అజిత్ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్ర‌స్తుతం త‌న 60వ సినిమా కోసం స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ చిత్రం యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నుండ‌గా, ఇందులో కొన్ని రిస్కీ స్టంట్స్ చేయాల్సి ఉంటుంద‌ట‌. ఇందుకోసం అజిత్ పూర్తి స్లిమ్‌గా మారి స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. అజిత్ కొత్త లుక్ చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. అజిత్ 60వ చిత్రం వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ చిత్రంలో జాన్వీ క‌పూర్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఈ చిత్రంతో జాన్వీ త‌మిళ తెర‌కి పరిచ‌యం కానుంద‌ని చెబుతున్నారు. మరి తమిళంలో జాన్వీకి మొదటి సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related posts