telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షూటింగ్ లో గాయపడ్డ స్టార్ హీరో అజిత్

Ajith

 తమిళ స్టార్ హీరో “తల” అజిత్ ఇటీవలే “నెర్కొండ పార్వాయి” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఖాకీ ఫేం హెచ్ వినోద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించ‌గాగా, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంక‌టచ‌లం, ఆండ్రియా తరియంగ్‌లు ముఖ్య పాత్ర‌లలో క‌నిపించారు. లాయ‌ర్ పాత్ర‌లో అజిత్ క‌నిపించి మెప్పించాడు. బోని క‌పూర్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం పింక్ రీమేక్ చిత్రంగా రూపొందిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మ‌రోసారి “నెర్కొండ పార్వాయి” టీంతో క‌లిసి త‌న 60వ చిత్రం చేస్తున్నాడు అజిత్‌. అజిత్ 60వ చిత్రం వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ‘వ‌లిమై’  అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని బోనీ క‌పూర్ నిర్మిస్తున్నారు. సోమ‌వారం రోజున ఓ బైక్ ఛేజింగ్ సీన్‌ను చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు బైక్ స్కిడ్ అయ్యింది. అజిత్‌కు చిన్న‌పాటి దెబ్బ‌లు త‌గిలాయ‌ట‌. ఇర‌వై నిమిషాల పాటు రెస్ట్ తీసుకుని ఆ సీన్‌ను అజిత్ కంప్లీట్ చేసేసి హాస్పిట‌ల్‌కు వెళ్లాడ‌ట‌. డాక్ట‌ర్స్ కొన్ని రోజుల పాటు రెస్ట్ సూచించార‌ట‌. త‌దుప‌రి ఈ సినిమా షెడ్యూల్ హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది.

Related posts