telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇకనుంచీ సర్జరీతో సిక్స్ ప్యాక్…!?

Six-Pack

సాధారణంగా ఒంట్లోని కొవ్వును కరిగించేందుకు లిపోసక్షన్ సర్జరీని చేయించుకుంటూరు. కానీ థాయ్‌ల్యాండ్‌కు చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా సిక్స్ ప్యాక్ కోసం లిపోసక్షన్‌ వైద్యం చేయించాడు. థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్‌లో మాస్టర్‌పీస్ కాస్మటిక్ ఆసుపత్రి ఈ రకమైన సర్జరీలను చేస్తోందని తెలుసుకున్న పాంగ్‌ పపార్న్ అనే 24 ఏళ్ల యువకుడు సిక్స్ ప్యాక్ సర్జరీ చేయించుకున్నాడు. తాను సిక్స్ ప్యాక్ కోసం ఎంతో శ్రమించానని, కానీ లాభం లేకపోవడంతో ఈ సర్జరీ చేయించుకున్నానని పాంగ్‌పపార్న్ చెబుతున్నాడు. ఈ సర్జీరీలో పొట్టలోని ప్రత్యేక భాగాలలో ఉన్న కొవ్వును తొలగించి సిక్స్ ప్యాక్ లైన్‌ వచ్చేలా ట్రీట్‌మెంట్ ఇస్తారు. పాంగ్‌పపార్న్ సర్జరీ ముందు, తరువాత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఈ ఫొటోలను చూసిన వారు సర్జరీ ద్వారా సిక్స్ ప్యాక్ వస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. కాగా ఈ ట్రీట్‌మెంట్‌లో ఎటువంటి ప్లాస్టిక్ లేదా సిలికాన్‌ను ఉపయోగించరని వైద్యులు చెబుతున్నారు.

Related posts