telugu navyamedia
news Telangana trending

ఆర్టీసీ సమ్మెకు .. టీజీవో, టీఎన్జీవో సంఘాలు మద్దతు ..

tgo and tngo supporting tsrtc protest

ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ సమ్మెకు టీజీవో, టీఎన్జీవో సంఘాలు మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశాయి. దీనితో నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో టీజీవో, టీఎన్జీవో నేతలతో ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ ఉద్యమంతో పాటు సకలజనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014 ఉద్యమంలో ఏమి ఆశించి ఉద్యమం చేశామని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఊరూరా ఆర్టీసీ బస్సులు తిప్పుదామనుకున్నామని.. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని టీజీవో, టీఎన్జీవో నేతలతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూ.2400 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు కూడా తక్కువేనని.. పడిన కష్టానికి ప్రతిఫలం లేదన్నారు.

ఆర్టీసీ ఆస్తులు, ఉద్యోగుల రక్షణకు మాత్రమే సమ్మె చేస్తున్నామన్నారు. ఉద్యోగ సంఘాలన్నీ తమ సమ్మెకు మద్దతిస్తాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. సమావేశం అనంతరం టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ ఐకాస నేతలు కోరారని చెప్పారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇద్దరు కార్మికులు మృతిచెందిన ఘటన ఎంతగానో కలచివేసిందన్నారు. సమ్మెకు టీఎన్జీవో సంపూర్ణ మద్దతు తెలుపుతోందని.. బుధవారం సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఇటీవల సీఎం కేసీఆర్‌తో జరిగిన భేటీపై పలు అపోహలు తలెత్తాయని.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే సీఎంను కలిసినట్లు రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Related posts

తెలంగాణ రైతుకు భరోసా.. రూ.లక్ష రుణమాఫీకి నేడు ఉత్తర్వులు: కేసీఆర్‌

vimala p

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్…ఇద్దరు ఉగ్రవాదుల హతం

vimala p

నాని “గ్యాంగ్ లీడర్” ట్రైలర్… థ్రిల్లర్ జోనర్ లోనే ఉన్నాడు… !

vimala p