telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ప్రపంచ కప్ … టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో… జెర్సీ పై మార్పులు అందుకే..

ఇప్పటివరకు వన్డే, పొట్టి క్రికెట్(టీ20) ఫార్మాట్ లో ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇక మీదట టెస్ట్ ఫార్మాట్ లో కూడా ప్రపంచ కప్ పోటీలకు శ్రీకారం చుడుతోంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ). ఈ కప్ కోసం మొత్తం 9 దేశాల నుండి 9 టీం లు పాల్గొంటున్నాయి. వీటి మధ్య టెస్ట్ మ్యాచ్ సిరీస్ లు జరిపి, చివరికి ఎవరు ఎక్కువ పాయింట్లతో ఉంటారో వారి మధ్య జూన్ 2021 లో ఫైనల్ జరుగుతుందట.

ఈ 9 టీం లలో ఇండియా, పాక్ సహా పలు దేశాల నుండి టీం(ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లాండ్, వెస్టిండీస్) లు పాల్గొంటున్నాయి. ఈ ఫార్మాట్ లో సిరీస్ కి 60 పాయింట్లు ఉంటాయి. ఒక్క సిరీస్ లో ఎన్ని టెస్ట్ మ్యాచ్ లు ఉన్నా మొత్తం కలిపి 60 పాయింట్లు ఇస్తారు. ఈ ఫార్మాట్ కి అప్పుడే టైం టేబుల్ ను విడుదల చేశారు. ఇప్పటికే ఏడాది పొడుగునా ఐపీఎల్ సహా పలు ఫార్మాట్లలో క్రికెట్ అభిమానులకు సందడిసందడి. ఈ టెస్ట్ ప్రపంచ కప్ తో ఈ సందడి మరింత పెరగనుంది.

సాధారణంగా టెస్ట్ మ్యాచ్ అంటే చాలా నిదానంగా ఆట సాగుతుంది కాబట్టి మొదటి నుండి ఈ ఫార్మాట్ కి ఆదరణ అంతగా ఉండకపోవటం నిజమే. కానీ, ప్రపంచ కప్ ఈ ఫార్మట్ లో కూడా ప్రారంభించారు కాబట్టి ఇకనుండి ఈ తరహా ఆటకు కూడా ఆదరణ విపరీతంగా పెరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

test format world cup will start on april 1stఈ ప్రపంచ కప్ లో భారత్ ఆడే మ్యాచ్ లు 10 కాగా, అందులో 2 బంగ్లాదేశ్ తో, 5 ఇంగ్లాండ్ తో, 3 దక్షిణాఫ్రికా తో ఆడనుంది. అలాగే హోమ్ లో ఆస్ట్రేలియా తో 4, న్యూజిలాండ్ తో 2, వెస్టిండీస్ తో 2 ఆడనుంది. మొత్తం 18 మ్యాచ్ లు ఇండియా అటు వేరే దేశ భూబాగంలోను, ఇటు సొంత భూమిలో ఆడనుంది. ఈ ప్రపంచ కప్ లో భారత్ శ్రీలంకతోను, పాక్ తోను ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం. దాయాదులుగా ఈ రెండుదేశాలతో ఉన్న సమస్యలే ఇందుకు కారణం కావచ్చు!!

Related posts