telugu navyamedia
crime news political

జమ్ము శివారులో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

kashmir police firing

జమ్ము శివారు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన నగ్రోటాలోని టోల్‌ ప్లాజా వద్ద ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌ సైతం గాయపడ్డాడు. ట్రక్కులో ప్రయాణిస్తున్న ఉగ్రవాదులు టోల్‌ప్లాజ్‌ సమీపంలోకి చేరుకునేసరికి ఒక్కసారిగా పోలీస్‌ టీంపై కాల్పులు జరిపారు.

శ్రీనగర్‌కు చెందిన ట్రక్కును సోదాల నిమిత్తం పోలీసులు ఆపగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా పోలీసులు సైతం కాల్పులు జరపడంతో సంఘటనా స్థలంలోనే ఓ ఉగ్రవాది మృతిచెందగా మరో ఇద్దరు సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది పారిపోయిన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు.

Related posts

కొత్త మున్సిపల్ చట్టంతో… అంతరికి మేలు… : కేసీఆర్

vimala p

ఇమ్రాన్ కు పీవోకేలో చేదు అనుభవం..గో బ్యాక్ అంటూ నినాదాలు

vimala p

టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామ!

vimala p