telugu navyamedia
రాజకీయ వార్తలు

నిఘా వర్గాల హెచ్చరికతో తమిళనాడులో రెడ్‌ అలర్ట్‌

High alert punjab Gujarat states

భారీ విధ్వంసం సృష్టించడంతోపాటు ప్రముఖ వ్యక్తులపై దాడులే లక్ష్యంగా పాకిస్థాన్‌ ప్రేరేపిత ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడులోకి చేరినట్లు నిఘావర్గాలు హెచ్చరించడంతో తమిళనాడులో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ పాకిస్థానీతోపాటు ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లిములు హిందువుల పేరిట దాడులు చేసేందుకు శ్రీలంక మీదుగా చొరబడి కోయంబత్తూరులోని రహస్య ప్రదేశంలో తలదాచుకున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.

దీంతో కోయంబత్తూర్ తోపాటు అన్ని జిల్లాల ఎస్పీలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కోయంబత్తూర్ నగరంలో సాయుధ పోలీసులను మోహరించి సోదాలు ముమ్మరం చేశారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ప్రార్థనాలయాలు, పర్యాటక ప్రాంతాలు, విదేశీ రాయబార కార్యాలయాల్లో లష్కరేతోయిబా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశముందని ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో సముద్ర తీరప్రాంతాల్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు.

Related posts