telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రభుత్వ పాఠశాలలపై ప్రతాపం చూపిన .. జమ్మూకశ్మీర్ ఉగ్రమూక..

terrorist attack on govt schools in J & K

కేంద్రపాలిత ప్రాంతంగా మారిన మొదటి రోజే ఉగ్రవాదుల జమ్మూకశ్మీర్ లో దుశ్చర్యకు పాల్పడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఓ ప్రభుత్వ పాఠశాలపై పెట్రోల్ బాంబు వేసి కల్లోలం రేపారు. షోపియాన్ జిల్లాలోని కుంద్లాన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలపై కొందరు ఉగ్రవాదుల పెట్రోల్ బాంబు వేసి పారిపోయారు. ఉగ్రవాదులు గత వారం ఓ పాఠశాల భవనంపై పెట్రోల్ బాంబు వేశారు.

విద్యార్థుల పరీక్షలు ఆరంభం అవుతున్న తరుణంలో ఉగ్రవాదులు పాఠశాలలపై దాడి చేయడం ఇది రెండోసారి. కొన్నిరోజుల క్రితం పుల్వామాలోని పాఠశాలలో బోర్డు పరీక్షలు సాగుతుండగా బయట ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని పునర్ విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో 12వ తరగతి విద్యార్థులు 48వేలమంది బోర్డు పరీక్షలు రాస్తున్నారు.

Related posts