telugu navyamedia
telugu cinema news trending

“ట‌ర్మినేట‌ర్ డార్క్ ఫేట్‌” ట్రైలర్ తెలుగులో … విజయ్ దేవరకొండ చేతుల మీదుగా…

Terminator

“పెళ్లి చూపులు” సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఆ త‌ర్వాత “అర్జున్ రెడ్డి”తో ఫేట్‌నే మార్చుకున్నాడు. దేశవ్యాప్తంగా ఆయ‌న‌కి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ సినిమా త‌ర్వాత “గీత గోవిందం”, “ట్యాక్సీవాలా” చిత్రాలు విజ‌య్‌కి మంచి విజ‌యం అందించాయి. ప్ర‌స్తుతం “హీరో” అనే సినిమా చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ తన తొమ్మిద‌వ సినిమాగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు. “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” డైరెక్టర్ క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయ్యింది. ఈ చిత్రానికి “వరల్డ్ ఫేమస్ లవర్” అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కాగా… యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ లుక్‌తో ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నారు. కాగా… హాలీవుడ్‌లో యాక్ష‌న్ థ్రిల్లర్ చిత్రాల‌కు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్ర‌త్యేకాదర‌ణ ఉంటుంది. అలాంటి చిత్రాల్లో “ట‌ర్మినేట‌ర్‌” సిరీస్ ఒక‌టి. ఇందులో చివ‌రి పార్ట్ ‘ట‌ర్మినేట‌ర్ డార్క్ ఫేట్‌’ సినిమా న‌వంబ‌ర్ 1న ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మయాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను ఈరోజు హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ “ప్ర‌భాస్ అన్న ‘ట‌ర్మినేట‌ర్‌’ లాంటి సినిమాలు చేయాలి. తెలుగులోకి హాలీవుడ్ సినిమాల‌ను తీసుకొస్తున్న డిస్నీ సంస్థ మ‌న “సాహో”, “సైరా”, “వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌” వంటి చిత్రాల‌ను హాలీవుడ్‌కి తీసుకెళ్లాలి” అని అన్నారు.

Related posts

వర్షాకాలం మొదలు.. నేడు, రేపు ..

vimala p

రాశిఫలాలు : ఎప్పుడూ పనేనా.. కుటుంబంతో కలిసి విహారయాత్ర చేయండి..

vimala p

హీరోయిన్ వయసుపై టీవీ నటుడి కామెంట్స్… ఆమె స్పందన ఇదీ

vimala p