telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

పది పరీక్షలకు అనుమతివ్వాలని హైకోర్టులో అఫిడవిట్!

sankranthi holidays in telangana

తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ కు సంబంధించి మూడు పరీక్షలు నిర్వహించారు. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం మిగతా పరీక్షల నిర్వహణ వాయిదా వేసింది. లాక్ డౌన్ కారణంగా పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ మేరకు ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. వైద్యుల సూచన మేరకు కరోనా నియంత్రణ ఏర్పాట్లు చేశామని అఫిడవిట్ లో వెల్లడించింది. కాగా, తమ అభ్యర్థనపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని తెలంగాణ విద్యాశాఖ హైకోర్టును కోరాలని భావిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే పదో తరగతి పబ్లిక్ కు సంబంధించి మూడు పరీక్షలు నిర్వహించారు. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం మిగతా పరీక్షల నిర్వహణ వాయిదా వేసింది.

Related posts