telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా

exam hall

తెలంగాణలో పదోతరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అధికారులతో అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి తీర్పుపై చర్చించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల మినహా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు శనివారం సాయం‍త్రం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై సంతృప్తి చెందని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల వాయిదాకే మొగ్గు చూపింది. రాష్ట్రంలో రెండుసార్లు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం భావించింది.

Related posts