telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

జూన్ 10 నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

huge job notification in telanganaf

తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. వచ్చేనెల 10 నుంచి పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. జూన్‌ 10 నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమై 24న ముగుస్తాయి. రోజూ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం12.15 గంటలకు ముగుస్తుంది. పరీక్షలకు సమయం తక్కువగా ఉండటంతో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ కోసం ఎదురుచూడొద్దని ప్రభుత్వం సూచించింది. అడ్వాన్స్‌ సప్లిమెంటరీకి సంబంధించి ఫీజు చెల్లింపు గడువు ఈనెల 25 వరకు ఉంది.

ఈనెల 29న పరీక్ష ఫీజును సంబంధిత పాఠశాల యాజమాన్యం ట్రెజరీలో జమచేసి ఈ నెల 31 నాటికి జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయానికి కంప్యూటర్‌ ఎక్స్‌ట్రాక్ట్స్‌ సమర్పించాలని, వీటిని జూన్‌ 3లోగా జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రభుత్వ పరీక్షల విభాగానికి సమర్పించాలని స్పష్టం చేసింది. అపరాధరుసుము రూ.50తో పరీక్షలకు రెండ్రోజుల ముందు వరకు చెల్లించే వెసులుబాటు కల్పించినా గడు వు తేదీలోగా చెల్లించాలని విద్యార్థులకు సూచించింది.

Related posts