telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

టెనార్ … జి2 .. అందుబాటు ధరలలోనే ..

tenor g2 in markets with reasonable rates

టెనార్ సంస్థ తాజాగా తన నూతన స్మార్ట్‌ఫోన్ టెనార్ జి2ను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌కు చెందిన ధర వివరాలను ఆ కంపెనీ ఇప్పుడు ప్రకటించింది. ఈ క్రమంలో టెనార్ జి2కు చెందిన 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.11,999 ధరకు లభ్యం కానుండగా.. 6జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.14,599 ధరకు లభ్యం కానుంది. ఈ రెండు వేరియెంట్లను ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో విక్రయించనున్నారు.

జి2 ఫీచర్లు :

6.18 ఇంచుల డిస్‌ప్లే,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్,
4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 9.0 పై,
16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

Related posts