telugu navyamedia
news sports trending

అర్జున్ టెండూల్కర్ .. ట్రిపుల్ సెంచరీ ..

tendulkar fan son great play like

సచిన్ టెండూల్కర్ అంతటి ఆటగాడు ప్రపంచంలోనే ఎంతో అరుదు. ఆటతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ అందరి మనసులు చూరగొనడం సచిన్ కే సాధ్యమైంది. సచిన్ ఆడుతున్న రోజుల్లో అతడి పేరును తమ పిల్లలకు పెట్టుకోవడం చాలా సందర్భాల్లో జరిగింది. సచిన్ ఇంటిపేరును తన కొడుక్కి పెట్టుకోవడమే కాదు, సచిన్ అంతటివాడ్ని చేసేందుకు ఓ తండ్రి పడుతున్న తాపత్రయం మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆ తండ్రికి విశేషమైన గుర్తింపు తెచ్చిపెడుతున్న ఆ తనయుడి పేరు అర్జున్ టెండూల్కర్. వాస్తవానికి సచిన్ కొడుకు పేరు కూడా అర్జునే. అనంతపురం జిల్లా గొట్లూరుకు చెందిన ఆదినారాయణ తన నలుగురు పిల్లల్లో ఒక అబ్బాయికి అర్జున్ టెండూల్కర్ అని పేరు పెట్టుకున్నాడు. సచిన్ పై ఆరాధనతోనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అండర్-16 జిల్లా స్థాయిలో విధ్వంసక బ్యాటింగ్ తో తన పేరులోని టెండూల్కర్ కు సార్థకత చేకూరుస్తున్నాడు. ఇటీవలే కడప జిల్లా జట్టుపై ట్రిపుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. 215 బంతుల్లో 308 పరుగులు చేశాడు. అర్జున్ స్కోరులో 39 ఫోర్లు, 13 సిక్సులు బాదాడు. దాంతో ఈ యువ ఆటగాడి పేరు ఆంధ్రా క్రికెట్ వర్గాల్లో మార్మోగింది. అర్జున్ తండ్రి ఆదినారాయణ క్రికెట్ పై మక్కువతో తన నలుగురు పిల్లల్లో ముగ్గురికి క్రికెట్ లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. క్రికెట్ కోసమే తన కుటుంబాన్ని గొట్లూరు నుంచి అనంతపురంకు తరలించాడు. ఆదినారాయణ కృషి ఫలించి, అర్జున్ టెండూల్కర్ జిల్లాస్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ రాష్ట్ర జట్టులో స్థానం కోసం ఉరకలేస్తున్నాడు.

Related posts

పాకిస్థాన్ కు మరో ఎదురుదెబ్బ.. భారత్ కు మద్దతుగా దక్షిణాసియా దేశాలు!

vimala p

ఉగ్రదాడిని ఖండించిన క్రికెటర్లు.. యుద్ధం చేయాల్సిందే: గంభీర్‌

vimala p

మహిళా లగేజీని చెక్ చేసిన అధికారులకు షాక్… డ్రగ్స్, బంగారం కాదు… కానీ…!

vimala p