telugu navyamedia
సినిమా వార్తలు

“తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్” ఫస్ట్ లుక్

Tenali

యువకథానాయకుడు సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రంగా “తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్” రూపొందుతోంది. హాస్య ప్రధానమైన చిత్రాలను తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించి నవ్వులు పూయిస్తారు జి.నాగేశ్వర రెడ్డి. ఈ సినిమాలో సందీప్ కిషన్ కేసులు లేని లాయర్ గా నటిస్తున్నాడు. ఆయన సరసన నాయికగా హన్సిక నటిస్తుండగా, మరో కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనున్నారు. ఈ రోజున సందీప్ కిషన్ పుట్టినరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సందీప్ కిషన్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ అయినా ఆయనకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.

Related posts