telugu navyamedia
సినిమా వార్తలు

ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర 10 సినిమాలు

Tollywood

ఈ నెల చివర నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాల హడావుడి మొదలు కాబోతోంది. అందరూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న సాహో, సైరా వంటి భారీ సినిమాలు బాక్స్ ఆఫీస్ షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఆగ‌స్ట్ 30న సాహో, ఆ త‌ర్వాత గ్యాంగ్ లీడ‌ర్, వాల్మీకి, సైరా వంటి చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా… ఇక ఈ వారంతో చిన్న సినిమాల హడావుడి ముగిసినట్టే. ఈ శుక్ర‌వారం (ఆగ‌స్ట్ 23) దాదాపు ప‌ది సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ద‌మ‌య్యాయి. అయితే ఇలా ఒకేరోజు పది సినిమాలు విడుదల కావడం అనేది చిన్న నిర్మాతలకు తలనొప్పులు తెచ్చిపెడుతుంది. అయితే ఒకేరోజు ఇన్ని సినిమాలు థియేటర్లలోకి రావడంతో ప్రేక్షకులు కూడా సందిగ్ధంలో పడతారు. తమిళ్‌లో సక్సెస్‌ అయిన “కనా” సినిమా తెలుగులో “కౌసల్యా కృష్ణమూర్తి” పేరుతో రీమేక్ అవుతోంది. ఈ చిత్రం శుక్ర‌వారం విడుదల కానుంది. ఈ సినిమాకు బాగానే బజ్ ఏర్పడింది. ఈ సినిమాతో పాటు ఏదైనా జరగొచ్చు సినిమా కూడా శుక్ర‌వార‌మే విడుద‌ల కానుంది. ఈ సినిమాపై కూడా కాస్త అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు బాయ్‌, ఉండిపోరాదే, నేనే కేడీ నెం-1, జిందా గ్యాంగ్‌, నీతోనే హాయ్‌ హాయ్‌, కనులు కనులు దోచేనే, నివాసి, హవా వంటి చిత్రాలు కూడా శుక్ర‌వారమే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల‌కి సంబంధించిన హ‌డావిడి పెద్ద‌గా లేక‌పోవ‌డంతో ఈ చిత్రాలు ప్రేక్ష‌కాద‌రణ పొందడం కొంచం కష్టమంటున్నారు సినీ విశ్లేషకులు.

Related posts