telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

విడాకుల కోసం గుడి.. కావాలనుకున్నవాళ్ళు వెళ్లొచ్చు.. మీ కోరిక తీరుతుంది.. !

temple to get divorce from any bond

సాధారణంగా గుడికి వెళితే, మంచి జీవిత భాగస్వామిని ఇవ్వమనో, మంచి ఉద్యోగం లభించేలా చేయమనో, అందరితో బంధాలు చక్కగా ఉండేలా చూడమనో కోరుకుంటాం. కానీ, జపాన్‌లోని ఓ దేవాలయానికి ఎవరైనా వెళ్లారంటే భర్తతో విడాకులు ఇప్పించమని, బంధాల నుంచి విముక్తి చేయమని కోరుకోవడానికి మాత్రమే వెళ్తారట. ఎందుకంటే భక్తులు కోరుకున్న బంధాన్ని తెంచడంలో ఆ ఆలయం సుప్రసిద్ధం. ‘యాసుయ్ కోన్ప్రేగు’ అనే ఈ దేవాలయం జపాన్‌లోని ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన జిల్లా హిగషియమలోని క్యోటో నగరంలో ఉంది.

భాగస్వామితో విడిపోవాలనుకున్నా, మరో అమ్మాయి/అబ్బాయితో కొనసాగుతున్న తన జీవిత భాగస్వామి ప్రేమాయణానికి ఫుల్‌స్టాప్‌ పడాలన్నా.. ఒప్పందంతో ఉన్న ఉద్యోగంలో నుంచి తనంతట తానుగా కాకుండా కంపెనీయే సామరస్యంగా బయటకు పంపాలన్నా, వ్యాపార భాగస్వామితో వ్యాపారం ముగించాలన్నా ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. వాగ్వాదం, ఘర్షణ లాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. కోర్టు కేసులు, ఆర్థిక అడ్డంకులతో ఎన్నో చిక్కులు వచ్చిపడతాయి. ఆ తర్వాత ఒకరి ముఖం మరొకరు చూసుకోలేని పరిస్థితీ ఏర్పడుతుంది. అలాంటివేవీ జరగకుండా ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఆ బంధాలు తెగిపోవాలంటే ‘యాసుయ్‌ కోన్పేగు’ దేవాలయంలో ప్రార్థనలు చేస్తే సరిపోతుందట.

temple to get divorce from any bondఇక్కడ, దేవాలయంలో పెద్ద బండరాయి ఉంది. దాని మధ్యలో మనిషి దూరేంత రంధ్రం ఉంటుంది. భక్తులు తాము తెంచుకోవాలనుకుంటున్న బంధం వివరాలను చీటిపై రాసి బండరాయి మధ్యలో ఉన్న రంధ్రం నుంచి రెండు సార్లు బండరాయిపై ఉన్న వస్త్రానికి కట్టాలి. తమ బంధాన్ని దూరం చేయమని ప్రార్థించాలి. అలా చేసిన వారికి ఖచ్చితంగా మొక్కు తీరుతుందని జపాన్‌ ప్రజలు విశ్వసిస్తున్నారు.

Related posts