telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సినిమా వార్తలు

సోనూ సూద్‌కు గుడి కట్టిన సిద్దిపేట ప్రజలు..

లాక్‌డౌన్‌ సమయంలో కష్టాల్లో ఉన్న వారికి విశేషమైన సేవలందించి రియల్‌ హీరోగా నిలిచాడు సోనూ సూద్‌. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సోనూ సూద్‌కి ఏకంగా గుడి కట్టేశాడు. అది కూడా తన సొంత ఖర్చుతో సోనూ సూద్‌కు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఆ అభిమాని. ఇది ఎక్కడో కాదు… సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తండా పరిధిలోని చెలిమితండాలో సోనూ సూద్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. వివరాల్లోకి వెళితే.. చెలిమితండాకు చెందిన రాజేష్ రాథోడ్‌కు సోనూసూద్‌ అంటే అభిమానం. కరోనా సమయంలో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలకు ముగ్ధుడైన రాజేష్‌ తమ తండాలో సోనూ సూద్‌ కోసం ఏకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రాజేష్‌ సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తండా వాసులు అభినందించారు. ఇక ఆదివారం స్థానికులు విగ్రహానికి పూజలు నిర్వహించి హారతి కూడా ఇచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Related posts