telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

మరింతగా ఎండలు .. మండిపోనున్నాయి.. తస్మాత్ జాగర్త!!

cyclone in iran costs 76 lives

ఈసారి వేసవి కాలం ప్రారంభంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వేడిమి తట్టుకోలేకుండా ఉంటె, మరో చేదువార్త.. వినాల్సివస్తుంది. ఈ వేసవి సీజన్ లో దేశంలోనే అత్యధికంగా వడగాల్పులు వీచే డేంజర్ జోన్ లో తెలంగాణ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ లోనే ఎండల తీవ్రతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇక, తీవ్రత పెరిగి, వడగాల్పులు వస్తే, పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణపైకి వేడి గాలులు రానున్నాయని, దీని ప్రభావంతో 47 నుంచి 49 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలోనే ఆదిలాబాద్, భద్రాచలం వంటి ప్రాంతాల్లో మరింత వేడి వుంటుందని తెలిపారు. ఇప్పటికే సాధారణంతో పోలిస్తే 2 నుంచి 4 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అన్నారు. కాగా, ఈ ఎండల కారణంగా సుమారు 2.50 లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయిందని, వేలాది ఎకరాల్లో వరి కోతలు నిలిచిపోయాయని, ఎండల దెబ్బకు కూలీలు కూడా పనికి రావడం లేదని తెలుస్తోంది.

Related posts