telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ 152వ సినిమా విడుదల తేదీ ఖరారు

chiru-koratala

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రాన్ని ఆగస్టులో, చిరంజీవి పుట్టన రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుందట. తొలుత ఈ మూవీని దసరాకు విడుదల చేయాలని భావించారట. చిరంజీవి పుట్టిన రోజైతే బాగుంటుందని అనుకుంటున్నారట. దీంతో ఈ మూవీని ఆగస్టు 21న విడుదల చేస్తారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీలకమైన కొన్ని సన్నివేశాలను పూర్తి చేశారట. మే చివరి నాటికి ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేయాలనే ప్లాన్‌లో దర్శకుడు ఉన్నారట. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.కాగా ఈ చిత్రంలో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించన్నారని సమాచారం. చిరంజీవికిది 152వ సినిమా.ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Related posts