telugu navyamedia
సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో నిలిచే బడా సినిమాలు ఇవే

Tollywood

ప్రతియేటా సంక్రాంతి వ‌చ్చిందంటే థియేట‌ర్ల‌లో స్టార్ హీరోల సినిమాలు సంద‌డి చేస్తాయన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి విన‌య విధేయ రామ‌, పేట‌, క‌థానాయ‌కుడు, ఎఫ్-2 చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రాగా… ఎఫ్‌-2 మాత్రమే ప్రేక్షకులను మెప్పించగలిగింది. ఇక వ‌చ్చే సంవ‌త్సరం సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సంక్రాంతి రేసులో సంద‌డి చేయడానికి సిద్ధమవుతున్నాయి. మ‌హేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెరకెక్క‌నున్న చిత్రం అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. మ‌రో వైపు బాల‌కృష్ణ, కేఎస్ రవికుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రం కూడా సంక్రాంతి బ‌రిలోనే నిలవనుంది. వీటితో పాటు మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ర‌జ‌నీకాంత్ ద‌ర్భార్, అల్లు అర్జున్‌- త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్స్ కూడా సంక్రాంతికి రేసులో నిలవడానికి సిద్ధమవుతున్నాయి. మరి ఈ సంక్రాంతి రేసులో ఎవరు విజేతలుగా నిలుస్తారో చూడాలి.

Related posts