telugu navyamedia
రాశి ఫలాలు

ఈ రాశి వారికీ అనుకోని శుభవార్త

Today Rasi Phalalu

మేష రాశి
మీస్నేహితుని నిర్లిప్తత, పట్టించుకోనితనం మిమ్మల్ని బాధిస్తుంది. కానీ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అది మిమ్మల్ని బాధించకుండా, ఇంకా చెప్పాలంటే కష్ట కాలాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించడం మంచిది. మీ సృజనాత్మకత నైపుణ్యాలు, సరియైన వాడుకలో ఉంచగలిగితే, ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడి నిస్తాయి. రోజు రెండవ భాగంలో అనుకోని శుభవార్త, ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుతుంది. క్రొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి, మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్ గా సాక్షాత్కరించడం ఖాయం.

వృషభ రాశి
జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్)పొందుతారు. ఏరోజుకారోజు బ్రతకడంకోసం, సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చుచేసే స్వభావాన్ని అదుపుచేసుకొండి. మీ అతి ఉదార స్వభావాన్ని బంధువులు అలుసుగా తీసుకుని దుర్వినియోగపరచడానికి ప్రయత్నిస్తారు. మీకుమీరుగా నియంత్రించుకొండి. లేకుంటే, మోసపోతారు. మీరు గుర్తు ఉంచుకోవలసినది ఏమంటే, ఉదారత కొంతవరకే అయితే మంచిదే, కానీ మితిమీరితే ప్రమాదాలకు దారి తీస్తుంది. పెళ్ళిబాజాలు, కొంతమందికి రొమాన్స్ ఉండి వారి ఃఉషారు తారాస్థాయిలో ఉంటుంది. మీ పని బాగా చేశారు. ఇక ఇప్పుడు దాని ఫలితాలను అందుకోవాల్సిన వేళ ఇది. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కన్పించడం ఖాయం. తననుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ ప్రైజ్ అందుకోవచ్చు.

మిథున రాశి
చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. వంటయింటికి కోసం ముఖ్యమైన వాటిని కొనుగోలు చేసేపని, మిమ్మల్ని సాయంత్రం అంతా బిజీగా ఉంచుతుంది. మీ లవర్ వ్యాఖ్యలు, మీరు సున్నిత మనస్కులవడంతో, మీకు బాధ కలిగిస్తాయి. – మీ భావోద్రేకాలను అదుపుచేసుకుని, ఏమీ మ్చెయ్యకండి. లేదంటే, తరువాత పరిస్థితి దారుణంగా ఉండగలదు. ఉమ్మడి వ్యాపారాలకు పూనుకోవద్దు- భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించవచ్చును. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు.

కటక రాశి
పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక, మీ ఆతృత మాయమైపోతుంది. మీరు తెలుసుకోవలసినదేమంటే ఇది సబ్బు బుడగ తాకగానే కనిపించనట్లుగానే, ధైర్యంతో తాకగానే ఈ ఆతృత, భయం, యాంగ్జైటీ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయని అర్థం చేసుకోవాలి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది. రొమాన్స్ కి మంచి రోజు. మీ రెస్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు.

సింహరాశి
మీ ఆరోగ్యాన్ని చక్కగాను, శరీరాన్ని దృడంగాను ఉంచుకోవడం కోసం, ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. ఒకరు పెద్ద పథకాలతోను, ఆలోచనలతోను మీ దృష్టిని ఆకర్షిస్తారు- వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకొండి. పిల్లలు మీకు రోజుగడవడం కష్టతరం చేవచ్చును. వారి అభిరుచిని నిలపడానికిగాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన వత్తిడిని దూరంగా ఉంచండి. గుర్తుంచుకొండి, ప్రేమిస్తేనే, ప్రేమను పొందగలరు. ఈ రోజు మీ ప్రేమైక జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది. క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమయిన రోజు. ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవపడవచ్చు.

కన్యా రాశి
మీరు అత్యంత ధైర్యం మరియు బలం ప్రదర్శించ వలసిఉన్నది. ఎందుకంటే మీరిప్పటికే కొన్ని పీడలను వ్యథ లను అనుభవించిఉన్నారు. అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమించగలరు. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మలని బాగా పరపతిగల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. ప్రేమయొక్క ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. మీరుండే చోటుకి మీ పైఅధికారిని, మరియు సీనియర్లని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు నిజంగా మంచి మూడ్ లో ఉన్నారు. మీకు ఓ చక్కని సర్ ప్రైజ్ తప్పదనిపిస్తోంది.

తులా రాశి
మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. మీ అంకిత భావం, కష్టించి పని చేయడం, గుర్తింపునందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. తప్పు వేళలో తప్పు విషయాలు అనడానికి ప్రయత్నించకండి- మీరు ప్రేమించేవారిని ఏమీ బాధపెట్టకుండా జాగ్రత్త పడండి. మీ ప్రేమ జీవనం, వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును. ఈరోజు మీరు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే, మీరు తప్పు అని ఋజువు చెయాలని ఒకరు, ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ రోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలుపడానికి ఆత్రపడకండి. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసే రోజిది. మీ భాగస్వామితో ప్రేమ, శృంగారాల లోతులు కొలుస్తారు మీరు.

వృశ్చికరాశి
మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.- అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. సాయంత్రం, మీరున్నచోటికి అనుకోని అతిథులు క్రమ్మెస్తారు. మీ జతవ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు, సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. ఆఫీసులో మీకు ఈ రోజు ఓ అద్భుతమైన రోజులా కన్పిస్తోంది. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు.

ధనుస్సు రాశి
మీ దీర్ఘకాల అనారోగ్యానికి నవ్వుల వైద్యాన్ని వాడండి. అన్నిసమస్యలకు ఇది సర్వరోగనివారిణి. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతిఒక్కరినీ రిలాక్స్ అయేలాగ ఆహ్లాదం పొందేలాగ చేస్తుంది. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి. – ఎందుకంటే, మీ లవర్ అంతుపట్టని మూడ్ లో ఉంటారు. మీ లక్ష్యం చేరుకున్నారు, మీ స్థిర సంకల్పం నెరవేరింది. మీకలలు సాకారమవడం మీరు చూస్తారు. కాకపోతే దీనిని మీ తలకెక్కించుకోకండి. నమ్మకంగా కష్టపడి పనిచెయ్యడం కొనసాగించండి. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఇరుగుపొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ రాజేయవచ్చు.

మకర రాశి
మీలో ప్రకృతి చెప్పుకోతగినంత విశ్వాసాన్ని, తెలివిని నింపింది- కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకొండి. అంతేకానీ వీధిన పడకండి. లేకపోతే పరువుపోగలదు. ఒక్కవైపు- ఆకర్షణం, ఈరోజు వినాశకారిగిగా ఋజువు అవుతుంది. మీకు కావాలనుకున్న పనులు చెయ్యమని ఇతరులని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. మీరూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు.

కుంభరాశి
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకిది హై టైమ్. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి, వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచెయ్యండి. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా, మీ విలువైన క్షణాలలో మరల జీవించండి. పనులు జరిగేవరకు వేచి ఉండడం మానండి, మీరే అవకాశాలను క్రొత్తవాటిని వెతికి అందుకొండి. మీరు ప్రవేశించిన ఏపోటీ అయినా మీకుగల పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు.

మీన రాశి
మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అదికూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. ఈ రోజు, మూలధనం సంపాదించగలుగుతారు- మొండిబకాయిలు వసూలు చేస్తారు. లేదా క్రొత్త ప్రాజెక్ట్ లకోసం నిధులకోసం అడుగుతారు. గృహస్థ జీవితం ప్రశాంతంగాను, ప్రశంసార్హం గానూ ఉంటుంది. మీ కలల రాణిని, స్వప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక అప్పుడు, ఆమెకలవగానే,కళ్ళు సంతోషంతో, చమక్కు మంటాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆఫీసులో ఈ రోజు మీకు శుభవార్త అందవచ్చు. మీరు మీనుండీ సహాయం కోసం ఎదురుచూసే వారికి ఆదుకుంటామని కమిట్ అవుతారు. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు.

Related posts